- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. విజయ్‍కు బీజేపీ బంపరాఫర్?
తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. విజయ్ కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సారి ఇక్కడ పాగా వేయాలని బీజేపీ (BJP) ప్లాన్ చేస్తుంటే అధికారం కాపాడుకునేందుకు డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో టీవీకే విజయ్ (Thalapathy Vijay) పార్టీ పొత్తుల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని టీవీకే చీఫ్ విజయ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినా ఉహాగానాలు మాత్రం ఆగడం లేదు.
డిప్యూటీ సీఎం ఆఫర్:
తాజాగా టీవీకే (TVK Party) విజయ్‍కు బీజేపీ బంపరాఫ్ ఇచ్చినట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీవీకేతో పొత్తుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని పొత్తు కుదిరితే టీవీకేకు 80 సీట్లు, విజయ్‍కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం సీఎం పదవి పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం బీజేపీతో పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేసినా ప్రచారం ఆగకపోవడంతో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సైతం విజయ్ పార్టీతో పొత్తుకు చూస్తోందనే చర్చ జరుగుతోంది.






