ఓటు చోరీపై సర్వే.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-02 13:08:24  IST  )

రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపై కర్ణాటకలో బీజేపీ సర్వే చేసింది...

ఓటు చోరీపై సర్వే.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandi) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ విమర్శలకు బీజేపీ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఫ్రీ అండ్ ఫెయిర్‌(Free and Fair) పేరుతో కర్ణాటక(Karnataka)లో సర్వే నిర్వహించింది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందా..?, ఫలితాలు కరెక్టేనా, కాదా.?.. అంశంపై ఆ రాష్ట్రంలో ప్రజా సర్వే చేశారు. అయితే ఈ సర్వేలో మెజార్టీ ప్రజలు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కే మద్దతు తెలిపారు.

రాహుల్‌పై సర్వే సెగలు

దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజాద్ పూనావాలా(BJP National General Secretary Shehzad Poonawalla) విమర్శలు కురిపించారు. జాతీయ ఎన్నికల సంఘం(National Election Commission) ద్వారా నిర్వహించే ఎన్నికలపై లోక్ సభ(Lokhsabha) వేదికగా రాహుల్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం పోయేలా వ్యాఖ్యలు చేశారని, కానీ కర్ణాటక ప్రజల తీర్పు తెలుసుకోవాలని సూచించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ పేరుతో నిర్వహించిన సర్వేను 84.5 శాతం మంది కర్ణాటక ప్రజలు స్వాగతించారని తెలిపారు. ఇందులో 83.61 శాతం పౌరులు ఈవీఎం ద్వారా ఎన్నికలను నమ్మారని పేర్కొన్నారు. 2023లో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు కరెక్ట్ అని 77.9 శాతం మంది ప్రజలు నమ్మారని, ఇప్పుడు ఆ శాతం పెరిగి 83.61కు పెరిగిందని పూనావాలా వెల్లడించారు.

రాహుల్‌పై ఆర్ అశోక్ సైతం విమర్శలు

కర్ణాటక బీజేపీ పక్ష నాయకుడు ఆర్ అశోక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ పాతకాలపు ఆలోచలు చేస్తున్నారని, అందుకే ఈవీఎంలపై ఆరోపణలు చేశారని విమర్శించారు. రాహుల్ చేసిన ఓటు చోరీ కామెంట్స్ జాతీయ ఎన్నికల కమిషన్‌ను విమర్శించడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి డ్రామాలకు తావులేదని, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, గెలిచినప్పుడు మాత్రం పార్టీ చేసుకుంటుందని ఎద్దేవా చేశారు.

సర్వే జరిగిందిలా..?

2024లో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు నిజమైనదా కాదా అంటూ కర్ణాటకలోని 202 నియోజకవర్గాల్లో ప్రజాభియాన్ని స్వీకరించారు. కర్ణాటక మానిటరింగ్, ఎవల్యూషన్ అథారిటీ ఆధ్వర్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ పేరుతో సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మొత్తం 5100 మంది పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా జరిగాయని 91.31 శాతం మంది ప్రజలు తెలిపారు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలపై 83.61 ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలోని 4,272 మందికి నిర్వహించిన సర్వేలో తాము ఓటు హక్కు వినియోగించుకున్నామని, అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా కరెక్టేనంటూ 95.44 శాతం మంది ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది.

Next Story