అధికార పార్టీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ విజయం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-14 08:58:44  IST  )

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి.

అధికార పార్టీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుండగా.. జమ్మూ కశ్మీర్‌లోని నాగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో (Nagrota Assembly by-election) బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా (Devayani Rana) ఘన విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో బలమైన పోటీ ఉంటుందని అంచనా వేసిన ఈ నియోజకవర్గంలో, అధికార పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా కాపాడుకో లేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రజలు మరోసారి రాణా కుటుంబానికి ఆశీర్వాదంగా భారీ మెజారిటీ ఇవ్వడం, స్థానిక రాజకీయ పరిణామాల్లో ఓ కీలక మలుపు గా భావిస్తున్నారు.

విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ.. “నాగ్రోటా ప్రజలు ఒక కుటుంబంలా నిలబడి ఆశీర్వదించారు. నా తండ్రి రాణా సాహిబ్‌కు చూపిన ప్రేమను ఈ రోజూ నాకు చూపించారు”. “ఇక్కడ నగ్రోటా ప్రజలు ఇచ్చిన తీర్పుతో పాటు బీహార్‌లో కూడా మీరు ఇదే ఫలితాలను చూస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎదుర్కొన్న ఈ దారుణ పరాజయం, ఉప ఎన్నికల్లో బీజేపీ పట్టు ఎంత బలంగా ఉందో మరోసారి రుజువు చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Next Story