బీజేపీ నేతకు చెప్పు దెబ్బలు.. ఇంటి నుంచి బయటకు లాగి మరీ కొట్టిన మహిళా కార్యకర్తలు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బీజేపీ బూత్ అధ్యక్షుడు ఆనంద్ శర్మను చెప్పుతో కొట్టారు మహిళా కార్యకర్తలు. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపడంతో ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చింది. ఈ ఘటన ఖండౌలీ ప్రాంతంలో జరిగింది.

బీజేపీ నేతకు చెప్పు దెబ్బలు.. ఇంటి నుంచి బయటకు లాగి మరీ కొట్టిన మహిళా కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బీజేపీ బూత్ అధ్యక్షుడు ఆనంద్ శర్మను చెప్పుతో కొట్టారు మహిళా కార్యకర్తలు. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపడంతో ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చింది. ఈ ఘటన ఖండౌలీ ప్రాంతంలో జరిగింది. శర్మను అతని ఇంటి నుంచి బయటకు లాగి మరీ చెప్పులతో కొట్టారు. బీజేపీ మహిళా మోర్చా అధికారి ఆశా అగర్వాల్ ప్రకారం.. శర్మ ఒక నెలకు పైగా మహిళా కార్యకర్తలకు అసభ్యకరమైన కంటెంట్ పంపుతున్నాడు. హెచ్చరించినా పట్టించుకోలేదు. అతని భార్య జోక్యం చేసుకునే వరకు దాడి కొనసాగింది.

VIDEO

Next Story