Bihar elections: ఆ ఫోక్ సింగర్‌‌ సహా 12 మంది అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్ట్!

by Ajay Maddhiboyina |

బీహార్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేయగా తాజాగా 12 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పార్టీనేత, జానపద గాయని మైథిలి ఠాకూర్ సైతం ఉన్నారు. అలీనగర్ స్థానం నుండి మైథిలి బరిలోకి దిగుతోంది.

Bihar elections: ఆ ఫోక్ సింగర్‌‌ సహా 12 మంది అభ్యర్థులతో బీజేపీ సెకండ్ లిస్ట్!
X

దిశ‌, వెబ్ డెస్క్: బీహార్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే అభ్యర్థుల మొదటి లిస్టును విడుదల చేయగా తాజాగా 12 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పార్టీనేత, జానపద గాయని మైథిలి ఠాకూర్ సైతం ఉన్నారు. అలీనగర్ స్థానం నుండి మైథిలి బరిలోకి దిగుతోంది. మైథిలి బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ సమక్షంలో పార్టీలో చేరిన మరుసటి రోజే ఆమె పేరును ప్రకటించడం ఆశ్చర్యకరం. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నేత మిశ్రీలాల్ యాదవ్ ఉండగా ఆయనకు ఇవ్వకుండా మైథిలికి టికెట్ కేటాయించారు.

అంతే కాకుండా బక్సర్ నియోజకవర్గ టికెట్‌ను మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాకు కేటాయించింది. వీరితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే సురేశ్ శర్మ స్థానంలో ముజఫర్‌పూర్ నుండి రంజన్ కుమార్ బరిలోకి దిగనున్నారు. గోపాల్ గంజ్ నుండి సుభాష్ సింగ్, బనియాపూర్ నుండి చోటి కుమారి, హయాఘాట్ నుండి రామ్ చంద్ర ప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. అంతేకాకుండా సోనేపూర్ నుండి విజయ్ కుమార్ సింగ్, రొసెరా నుండి బీరేంద్ర కుమార్, బార్ నుండి సియారామ్, అజియాన్ నుండి మహేశ్ పాస్వాన్, శాపూర్ నుండి రాకేష్ ఓజా బరిలో దిగుతున్నారు.

Next Story