భారత పౌరసత్వం లేకుండానే సోనియాకు ఓటు!

by Phanindra |

భారత పౌరసత్వం లేకుండానే సోనియాకు ఓటు ఇచ్చారని బీజేపీ ఆరోపించింది. 1980 ఓటర్ లిస్టులో ఆమె పేరున్నదంటూ ఓటర్ జాబితా కాపీని షేర్ చేసింది.

భారత పౌరసత్వం లేకుండానే సోనియాకు ఓటు!
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. అసలు ఓట్ల చోరీకి ఆద్యులు కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారత పౌరసత్వం రావడానికి మూడేళ్ల ముందే ఓటు హక్కు ఇచ్చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తాజాగా ఈ అంశం లేవనెత్తారు.

ఇటలీలో పుట్టిన సోనియా గాంధీకి 1980లోనే భారత్‌లో ఓటు హక్కు ఇచ్చారని, అప్పటికి ఆమెకు భారత పౌరసత్వమే రాలేదని ఠాకూర్ గుర్తుచేశారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కూడా ఇదే ఆరోపణ చేస్తూ.. 1980 నాటి ఎలక్టోరల్ రోల్‌ ఫొటోకాపీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1980లో సఫ్దార్‌గంజ్ రోడ్‌లోని పోలింగ్ స్టేషన్‌లో గాంధీ కుటుంబంలోని ఇందిర, రాజీవ్, సంజయ్, మేనకతోపాటు సోనియా ఓట్లు ఉన్నట్లు ఎలక్టోర్ రోల్‌లో కాపీలో ఉంది.

‘ఎన్నికల చట్టాలకు ఇంత దారుణంగా తూట్లు పొడిచి సోనియా గాంధీని ఓటర్ల లిస్టులో చేర్చారు. ఇది చూస్తే అర్హత లేని వారి ఓట్లను రెగ్యులరైజ్ చేయడానికి రాహుల్ ఎందుకు ప్రయత్నిస్తున్నారో? అలాగే ఎస్‌ఐఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్తం చేసుకోవచ్చు’ అని మాలవీయ చురకలేశారు.

Next Story