Air India Ahmedabad Plane Crash : ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నా..బీజే మెడికల్ కాలేజీ విద్యార్థి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-13 11:06:17  IST  )

అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో విమానంలో ఉన్న‌వారితో పాటూ అది కూలిన బీజే కాలేజీ భ‌వనంపై ఉన్న 5గురు మెడికోలు

Air India Ahmedabad Plane Crash : ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నా..బీజే మెడికల్ కాలేజీ విద్యార్థి
X

దిశ‌, వెబ్ డెస్క్:అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో విమానంలో ఉన్న‌వారితో పాటూ అది కూలిన బీజే కాలేజీ భ‌వనంపై ఉన్న 5గురు మెడికోలు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో అప్ర‌మ‌త్త‌మైన కొంత‌మంది మెడిక‌ల్ విద్యార్థులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వారిలో త‌మిళ‌నాడుకు చెందిన ఓ పీజీ విద్యార్థి కూడా ఉన్నారు. అత‌డు మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు భోజనం చేసేందుకు తాము 5వ అంత‌స్తుకు వెళ్లామ‌ని చెప్పారు.

ఒక్క‌సారిగా భారీ శ‌బ్దం రావ‌డం, ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకోవ‌డంతో వెంట‌నే కింద‌కి ప‌రుగులు తీసిన‌ట్టు తెలిపాడు. అలా ఫస్ట్ ఫ్లోర్ వ‌ర‌కు ప‌రుగులు తీసినా అక్క‌డ కూడా ద‌ట్ట‌మైన పొగ వ్యాపించి ఉందని చెప్పారు. దీంతో ఫ‌స్ట్ ఫ్లోర్ నుండి కింద‌కి దూకి ప్రాణాలు కాపాడుకున్నాన‌ని అన్నాడు. ఆ స‌మ‌యంలో త‌న‌తో పాటూ 20 నుండి 30 మంది విద్యార్థులు ఉన్నార‌ని చెప్పాడు. తాము కింద‌కు దిగిన త‌ర‌వాత 15 నిమిషాల‌కు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ వ‌చ్చార‌ని అన్నాడు. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసిన త‌ర‌వాత‌నే బిల్డింగ్ పై విమానం కూలింద‌ని తెలిన‌ట్టు చెప్పాడు.

Next Story