అగర్‌బత్తీలకు బీఐఎస్ ప్రమాణాలు.. అలాంటి వాటిపై నిషేధం

by Ajay Maddhiboyina |

అగర్‌బత్తీల తయారీలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణాలను నిర్దేశించింది. వీటి తయారీలో హానికరమైన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.

అగర్‌బత్తీలకు బీఐఎస్ ప్రమాణాలు.. అలాంటి వాటిపై నిషేధం
X

దిశ‌, వెబ్ డెస్క్: అగర్‌బత్తీల తయారీలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణాలను నిర్దేశించింది. వీటి తయారీలో హానికరమైన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది. వినియోగదారుల భద్రత, గాలి నాణ్యత, పర్యావరణంపై ప్రభావంతో పాటు సువాసన సమ్మేళనాలు, రసాయనాలపై ఉన్న ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాటి త‌యారీ కోసం IS 19412:2025 ప్ర‌మాణాన్ని బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ తీసుకువ‌చ్చింది. బీఐఎస్ హాల్ మార్క్ ఉండ‌టం వ‌ల్ల కొనుగోలుదారులు న‌మ్మ‌కంతో ముందుకు వ‌స్తార‌ని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. అలెత్రిన్, పెర్మెత్రిన్, సైప‌ర్ మెత్రిన్, డెల్టామెత్రిన్, ఫిప్రోనిల్ లాంటి ర‌సాయ‌నాల‌ను వినియోగించ‌డాన్ని నిషేధించింది. వీటితో పాటు బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్, డైఫినైల‌మైన్ లాంటి ప‌దార్థాలపై సైతం ఆంక్ష‌లు విధించింది. హానిక‌ర ర‌సాయనాలు వాడ‌టం వ‌ల్ల ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని, గాలి నాణ్యత కూడా త‌గ్గిపోతుంద‌ని కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో అగ‌ర్ బ‌త్తీల‌పై బీఐఎస్ మార్క్ త‌ప్ప‌నిస‌రి కానుంది.

Next Story