Viral News : 10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మ.. కూతుళ్ల పేర్లు గుర్తులేని తండ్రి!

by Ramesh Naini |

హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Viral News : 10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మ.. కూతుళ్ల పేర్లు గుర్తులేని తండ్రి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే 10 మంది కూతుళ్లు ఉన్న ఓ మహిళ తాజాగా 11వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కుటుంబం 19 ఏళ్లుగా దాంపత్య జీవితం కొనసాగిస్తోంది. ఉచానాలోని ఓజాస్ ఆసుపత్రిలో ఈ ప్రసవం జరిగింది. వైద్యుల ప్రకారం, గర్భధారణతో పాటు ప్రసవం కూడా అత్యంత ప్రమాదకర స్థితిలో జరిగింది. మహిళకు తీవ్ర రక్తహీనత ఉండటంతో పాటు, శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక, కొడుకు పుట్టడంతో ఆ కుటుంబం పండగ చేసుకుంటుంది.

కొంత మంది కూతుళ్ళ పేర్లు మర్చిపోయిన తండ్రి

స్థానిక మీడియాతో మాట్లాడిన శిశువు తండ్రి, తన పెద్ద కుమార్తె శ్రీనా 12వ తరగతి, రెండో కుమార్తె అమృత 11వ తరగతి చదువుతోందని చెప్పారు. అనంతరం మిగిలిన కుమార్తెల పేర్లు చెప్పే క్రమంలో చివరికి ఇద్దరి పేర్లు గుర్తు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోను ఓ మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మగబిడ్డ కోసం మహిళ శరీరాన్ని పదే పదే ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం?’ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన లింగ వివక్ష, మహిళల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్‌పై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వీడియో ఇదే..

Next Story