- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పక్షుల గూళ్లా.. రాజమౌళి సినిమా సెట్టింగ్‌లా..? ఇంత అద్భుతంగా ఉన్నాయేంటి? (వీడియో)
పక్షులు గూళ్లు కట్టడం సాధారణం. కానీ చెట్ల పొదల్లోనో, ఇంటి దగ్గర్లోనో కట్టడం చూశాం. అవి కూడా చిన్నగా.. తమకు సరిపోయే విధంగా.. చాలా పకడ్బంధీగా కట్టుకుంటాయి. వేటికవే రక్షణను ఏర్పరుచుకుంటాయి. ఇతరులను తమ గూళ్లోకి అనుమతించవు. కానీ ఈ పక్షులు

దిశ, వెబ్‌సైట్ : పక్షులు గూళ్లు కట్టడం సాధారణం. కానీ చెట్ల పొదల్లోనో, ఇంటి దగ్గర్లోనో కట్టడం చూశాం. అవి కూడా చిన్నగా.. తమకు సరిపోయే విధంగా.. చాలా పకడ్బంధీగా కట్టుకుంటాయి. వేటికవే రక్షణను ఏర్పరుచుకుంటాయి. ఇతరులను తమ గూళ్లోకి అనుమతించవు. కానీ ఈ పక్షులు మాత్రం కరెంట్ పోల్ ఎంత ఎత్తుందో.. అంత పొడవుగా కట్టేశాయి. పైగా గ్రూప్‌గా కట్టుకుని.. హాయిగా ఇందులో నివసిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని కలహారి ఎడారిలో ఈ అద్భుతమైన గూళ్లు కనిపిస్తుండగా.. కరెంట్ స్తంభాలా రాజమౌళి సినిమా సెట్టింగులా అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
సోషియబుల్ వీవర్ పక్షులు (ఫిలెటైరస్ సోషియస్) దక్షిణ ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో ఈ గూళ్ళను నిర్మిస్తాయి. ఎడారిలో చెట్లు అరుదుగా ఉండటం వల్ల.. అవి తరచుగా టెలిఫోన్ స్తంభాలపై గూళ్ళను నిర్మిస్తాయి. గడ్డి, కొమ్మలతో నేసిన ఈ భారీ గూళ్ళు 100 పక్షుల వరకు, పిగ్మీ ఫాల్కన్‌లు, రోజీఫేస్డ్ లవ్‌బర్డ్స్ వంటి బహుళ జాతులకు ఆశ్రయమిస్తాయి. అంతేకాదు తీవ్రమైన ఉష్ణోగ్ర్గతల నుంచి రక్షణ కల్పిస్తాయి. విశ్రాంతి, సంతానోత్పత్తి కోసం ప్రత్యేక గదులను కలిగి ఉంటాయి. కొన్ని గూళ్ళు దశాబ్దాలపాటు ఉంటాయి.. కాలంతోపాటు పెరుగుతూ.. స్తంభాల ఎత్తును అల్లుకుపోతాయి.






