ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. 158 ప్రయాణికులు సేఫ్

by Kema Shiva Kumar |

అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో దేశం అంతా ఉలిక్కి పడింది.

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. 158 ప్రయాణికులు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో దేశం అంతా ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే విమానాల్లో సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం ఎయిరిండియా (AI-411) విమానాన్ని పక్షి ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. మొత్తం 158 ప్రయాణికులతో కోలంబో నుంచి చెన్నైకి ఎయిరిండియా బోయింగ్ 737-800 మోడల్ విమానం బయలుదేరింది. చెన్నై ఏటీసీ పరిధిలోని రాగానే ఆ ఫ్లైట్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

ల్యాండింగ్ తర్వాత రొటీన్ తనిఖీల్లో భాగంగా బర్డ్ హిట్‌ను అధికారులు గుర్తించారు. ప్రయాణంలో ఎటువంటి సమస్యలు లేవని, ల్యాండింగ్ తర్వాత మాత్రమే ఫ్లైట్‌లో చిన్న సాంకేతిక లోపాన్ని గుర్తించారు. అనంతరం బోయింగ్ 737-800 మోడల్ విమానాన్ని గ్రౌండెడ్ చేసి ఎయిరిండియా ఇంజనీర్లు అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆ ఫ్లైట్‌ను తిరిగి కోలంబోకి వెళ్లే ప్రయాణాన్ని రద్దు చేశారు. మరోవైపు కోలంబోకు వెళ్లే 137 మంది ప్రయాణికుల కోసం ఆల్టర్‌నేట్ విమానాన్ని ఎయిరిండియా సిబ్బంది సిద్ధం చేశారు.

Next Story