- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akhilesh Yadav: పీఎం, సీఎంలను అనర్హులను చేసే బిల్లుతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు
పార్టీల్లో తిరుగుబాటుకు ఆజ్యం పోసేందుకు మాత్రమే ఈ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిందని ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి 30 రోజులపాటు జైలులో ఉంటే పీఎం, సీఎం సహా మంత్రులనూ పదవి నుంచి తొలగించే బిల్లుపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి, ఆయా పార్టీల్లో తిరుగుబాటుకు ఆజ్యం పోసేందుకు మాత్రమే ఈ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిందని ఆరోపించారు. ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఎస్పీ చీఫ్.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. ఎన్నికల సమయంలో బీజేపీ దొంగ ఓట్ల అంశంపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తీసుకువచ్చారు. ప్రత్యర్థులను అణచివేయడానికి చట్టపరమైన చర్యలను ఉపయోగిస్తూనే, అధికార పార్టీ తన సొంత నాయకులపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టి వేస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి ఇలాంటి ఒకరోజు వస్తుందని ముందే తెలుసు, అందుకే ఆయనపై ఉన్న కేసులు ఉపసంహరించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు కూడా ఉపసంహరించుకున్నారు. ఈ బిల్లును తీసుకువచ్చిన వారే అనేక చోట్ల తమపై తప్పుడు కేసులు నమోదు చేసినట్టు అంగీకరించారు. అలాంటపుడు వారిని తప్పుగా ఇరికించగలిగితే, రేపు మరొకరిని కూడా ఇరికించవచ్చని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ నేతలు మొహమ్మద్ అజం ఖాన్, మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి, మాజీ ఎంపీ రమాకాంత్ యాదవ్‌ల అరెస్ట్ అయిన సందర్భాలను ఉదహరించారు. మా పార్టీ నేతలను సంవత్సరాల తరబడి జైలుకు ఎలా పంపుతున్నారో చూడవచ్చు. ఇది అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని వెల్లడించారు.






