H-1B వీసా ప్రోగ్రాం రద్దు కోరుతూ బిల్!

by Muthe.Rajitha |

భారతీయ టెకీలకు బిగ్ షాక్!

H-1B వీసా ప్రోగ్రాం రద్దు కోరుతూ బిల్!
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా కాంగ్రెస్‌లో H-1B వీసా ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఒక కీలక బిల్లును హౌసులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ సభలో ప్రవేశపెడుతూ.. "ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌ను సవరిస్తూ.. H-1B ప్రోగ్రాంను పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు. ఈ బిల్ చట్టంగా మారితే అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం పూర్తిగా రద్దవుతుంది. H-1B వీసాల్లో ఎక్కువగా ఉన్న భారతీయ టెకీలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బిల్లును హౌస్ జ్యూడిషియరీ, ఎనర్జీ అండ్ కామర్స్, వేస్ అండ్ మీన్స్ కమిటీలకు పంపించినప్పటికీ... దీనిపై ఇప్పటివరకు ఎలాంటి హియరింగ్స్ గాని, ఓటింగ్ తేదీలు గాని ఖరారు కాలేదు.

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది చాలా పెద్ద ప్రతిపాదన కావడంతో చట్టంగా మారే అవకాశాలు తక్కువే ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పెద్ద టెక్ కంపెనీలు, బిజినెస్ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా, 2025లో సెనేటర్లు చక్ గ్రాస్లీ, డిక్ డర్బిన్ ప్రవేశపెట్టిన H-1B, L-1 Visa Reform బిల్లు మాత్రం.. వీసా పూర్తిగా రద్దు కాకుండా, దుర్వినియోగం కాకుండా అరికట్టడం, అమెరికన్ ఉద్యోగుల రక్షణ వంటి సంస్కరణలపై దృష్టి పెట్టింది.

Next Story