- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సయీద్, అజహర్‌లను అప్పగించడానికి సిద్ధం.. ఇండియానే సహకరించడం లేదు: బిలావల్ భుట్టో
సయీద్, అజహర్‌లను అప్పగించడానికి పాక్ సిద్ధంగా ఉందని, కానీ ఇండియానే సహకరించడం లేదని బిలావల్ భుట్టో అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో తమకు సత్సంబంధాలు కావాలని, అందుకోసం భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వ్యక్తులను ఎక్స్‌ట్రడైట్ చేసేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్లో జర్దారీ అన్నారు. అయితే ఈ ప్రక్రియలో భారత్ కూడా తమతో సహకరించాలని ఆయన అన్నారు. లష్కర్-ఎ-తైబా చీఫ్ హఫీజ్ సయీద్, జైష్-ఎ-ముహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగిస్తారా? అనే ప్రశ్నకు భుట్టో బదులిచ్చారు. ‘పాకిస్తాన్‌తో చర్చలకు వస్తే కచ్చితంగా టెర్రరిజం గురించి చర్చిస్తాం. అప్పుడు ఇలాంటి చర్యలను పాక్ వ్యతిరేకిస్తుందని నేను అనుకోవడం లేదు’ అని చెప్పారు.
నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (నాక్టా) తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లో కూడా లష్కర్, జైషే గ్రూపులను బ్యాన్ చేశారు. ఉగ్రవాదులకు ఫైనాన్స్ చేసిన కేసులో సయీద్ 33 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా.. అజహర్‌ను కూడా గ్లోబల్ టెర్రరిస్టుగా నాక్టా గుర్తించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసిన భుట్టో.. వీళ్లిద్దరూ పాకిస్తాన్‌లో చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నారని, భారత్ తమతో సహకరించకపోవడం వల్ల వీళ్లను సీమాంతర ఉగ్రవాదం కేసుల్లో ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నామని చెప్పారు. ఉగ్రవాదులను వదిలిపెట్టమంటున్న భారత్ నినాదం సరికాదని భుట్టో అభిప్రాయపడ్డారు.
‘ఇలా చేయడం వల్ల భారత్, పాక్ రెండు దేశాలకు ఎలాంటి ఉపయోగం ఉండదు’ అని అన్నారు. సయీద్, అజహర్ ఎక్కడున్నారని ప్రశ్నించగా.. సయీద్ జైల్లో ఉన్నాడని, అజహర్ ఎక్కడున్నాడో తమకు తెలియదని చెప్పారు. ‘హఫీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడనేది అబద్ధం. అతను పాకిస్తాన్ అదుపులో ఉన్నాడు. ఇక అజహర్ ఎక్కడున్నాడో మాకు తెలియదు. అతన్ని అరెస్టు చేయడంలో మేం విఫలమయ్యాం. తను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని మా అనుమానం. అతను పాకిస్తాన్ గడ్డపై ఉన్నాడనే ఆధారాలను భారత్ చూపిస్తే.. అరెస్టు చేయడానికి మేం సిద్ధం’ అని భుట్టో పేర్కొన్నారు.






