- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమాచారమిస్తే మసూద్‌ను అరెస్ట్ చేస్తాం.. వ్యంగ్యంగా మాట్లాడిన బిలావల్ భుట్టో
పాకిస్తాన్‌లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (masood azhar), లష్కరే తోయిబా (Lashkar e Taiba) ముఠా నాయకుడు హఫీజ్ సయీద్‌లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా, పాకిస్తాన్ మాత్రం మౌనం వహిస్తూ తప్పించుకుంటోంది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ (masood azhar), లష్కరే తోయిబా (Lashkar e Taiba) ముఠా నాయకుడు హఫీజ్ సయీద్‌లు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా, పాకిస్తాన్ మాత్రం మౌనం వహిస్తూ తప్పించుకుంటోంది. ఇప్పుడు ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో (Bilawal Bhutto) మళ్లీ అదే ధోరణిలో స్పందించారు.
ఒక అంతర్జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ మాట్లాడుతూ.. “మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు స్పష్టత లేదు. ఆయన పాక్‌లోనే ఉన్నాడని భారత్ చెబితే, మేం వెంటనే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హఫీజ్ సయీద్ విషయంలోనూ అలానే మాట్లాడారు. హఫీజ్ సయీద్ ప్రజలమధ్య తిరుగుతున్నట్టు చెప్పడంలో నిజం లేదు. అతను ఇప్పటికే కస్టడీలో ఉన్నాడని పేర్కొన్నారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'లో (Operation Sindoor) చేపట్టి.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని జైషే, లష్కరే తోయిబా స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు నేలమట్టమవ్వగా.. మసూద్ అజార్ కుటుంబ సభ్యుల్లో 10 మంది మృతిచెందినట్లు పలు వార్తాసంస్థలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో బిలావల్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయని భారత అధికారులు అంటున్నారు. మసూద్ అజార్ పేరు అనేక ఉగ్రదాడుల కేసుల్లో నమోదై ఉంది. 1995లో అతడిని భారత్ అరెస్టు చేసినా, 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు విడిపించారు. అనంతరం జైషే మహ్మద్ ముఠాను స్థాపించిన మసూద్.. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబయి పేలుళ్లతో పాటు పలువురు మృతులకు కారణమయ్యాడు. 2019లో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. బిలావల్ తాజా వ్యాఖ్యలు పాక్ ఉగ్రవాదంపై నిజమైన చర్యలకు బదులు.. మాటలకే పరిమితమవుతోందని స్పష్టం చేస్తున్నాయి.






