- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ర్యాలీలో బైక్ పోయింది.. ఓటర్ అధికార్ యాత్రలో ఆసక్తికర ఘటన
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బిహార్‌లో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) బిహార్‌లో నిర్వహించిన (Voter Adhikar Yatra) ఓటర్ అధికార్ యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దర్భంగాలో నిర్వహించిన బైక్ ర్యాలీలో రాహుల్ సెక్యూరిటీ సిబ్బందికి శుభమ్ అనే వ్యక్తి తన బైకును ఇచ్చాడు. అయితే ఆ బైక్ పోయింది. విషయం తెలుసుకున్న రాహుల్ తాజాగా ఆ వ్యక్తికి కొత్త బైకును బహూకరించారు. వివరాల్లోకి వెలితే.. ఆగస్టు 27న రాహుల్ గాంధీ ఓటరు అధికార్ యాత్రలో భాగంగా దర్భంగాలో రోడ్ షో, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది ధాబా సమీపంలో పార్క్ చేసిన అనేక బైక్‌లను అడిగి తీసుకున్నారు. వాటిలో ధాబా యజమాని శుభమ్‌కు చెందిన (Pulsar 220) పల్సర్ 220 బైక్ కూడా ఉంది.
ధాబా యజమాని శుభమ్ మీడియాకు చెప్పిన ప్రకారం.. మొదట రాహుల్ భద్రత సిబ్బంది ధాబా దగ్గర టీ అడిగారు. వెంటనే వారు రోడ్ షో కోసం బైక్‌లను అడిగారు. కేవలం 1.5 కిలో మీటర్ల వరకే బైక్ ర్యాలీ ఉందని, తర్వాత బైక్‌లను తిరిగి ఇస్తామని వారు అతనికి హామీ ఇచ్చారు. భద్రతా సిబ్బంది బైక్ తీసుకెళ్లారు. కానీ రోడ్ షో అనంతరం బైక్ ఎక్కడా కనిపించలేదు. ఈ మేరకు శుభమ్ లోకల్ కాంగ్రెస్ నాయకులకు జరిగిన విషయం తెలియజేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుడు దేవేందర్ యాదవ్ అతన్ని సంప్రదించి పాట్నాకు ఆహ్వానించారు. సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నా చేరుకోవాలని అతనికి ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న రాహుల్.. సెప్టెంబర్ 1 వ తేదీన ఓటరు అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా, రాహుల్ గాంధీ వేదికపై నుంచి శుభమ్‌కు స్వయంగా కొత్త పల్సర్ 220 బైక్ కీలను అందజేశారు.






