- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. బిహార్ గ్యాంగ్ లీడర్ హతం
ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బిహార్‌కు చెందిన సిగ్మా గ్యాంగ్ లీడర్ సహా నలుగురు క్రిమినల్స్ హతమయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మోస్ట్‌వాంటెడ్ ‘సిగ్మా గ్యాంగ్’ సభ్యులు నలుగురు హతమయ్యారు. బిహార్‌కు చెందిన ఈ ముఠా.. ఢిల్లీలో తలదాచుకుంది. సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్ దాదాపు ప్రతినెలా నేరాలు చేస్తుందని, కాంట్రాక్ట్ హత్యలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. బిహార్ ఎన్నికలకు దగ్గర పడిన నేపథ్యంలో ఈ గ్యాంగ్‌పై ఫోకస్ పెట్టామని, వీళ్లు ఢిల్లీలో ఉన్నట్లు తెలిసి ఆపరేషన్ నిర్వహించామని బిహార్ డీజీపీ వినయ్ కుమార్ చెప్పారు. ఈ గ్యాంగ్ సాధారణంగా బిహార్ వెలుపల ప్లాన్ వేసుకొని, ఆ తర్వాత రాష్ట్రంలో పథకం ప్రకారం హత్యలు చేస్తుందని వివరించారు. ఢిల్లీ, బిహార్ పోలీసుల ఈ గ్యాంగ్ ఆచూకీ కనుగకొని అక్కడకు వెళ్లగా.. సిగ్మా గ్యాంగ్ కాల్పులకు తెగబడిందని, పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్ లీడర్ రంజన్ పథక్(25)తోపాటు బిమ్లేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) మరణించినట్లు ఆయన వెల్లడించారు.






