మేనల్లుడిని పెళ్లి చేసుకున్న అత్త.. సంచలనం రేపుతున్న ఘటన..

by Sujitha Rachapalli |

బీహార్‌లో మరో ఘోరం జరిగింది. బంకా జిల్లాకు చెందిన వివాహిత.. భర్తను వదిలేసి మేనల్లుడిని పెళ్లి చేసుకుంది. ఈ వార్త స్థానికంగా సంచలనం రేపుతుండగా.. కలియుగం వచ్చేసిందంటున్నారు జనాలు. వివరాల్లోకి వెళ్తే.. పూనమ్, శివమ్‌కు 11ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

మేనల్లుడిని పెళ్లి చేసుకున్న అత్త.. సంచలనం రేపుతున్న ఘటన..
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో మరో ఘోరం జరిగింది. బంకా జిల్లాకు చెందిన వివాహిత.. భర్తను వదిలేసి మేనల్లుడిని పెళ్లి చేసుకుంది. ఈ వార్త స్థానికంగా సంచలనం రేపుతుండగా.. కలియుగం వచ్చేసిందంటున్నారు జనాలు. వివరాల్లోకి వెళ్తే.. పూనమ్, శివమ్‌కు 11ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. కానీ పూనమ్ తన మేనల్లుడు అంకిత్‌పై మనసు పడింది. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అంకిత్ ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. కానీ శివమ్‌కు అనుమానం రాలేదు. దీంతో ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.

కానీ నమ్మకద్రోహం చేస్తూ అత్త, మేనల్లుడు ఇద్దరు ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ ఫొటోలను వాట్సాప్ ద్వారా భర్త శివమ్‌కు పంపింది పూనమ్. దీంతో శివమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన ఇద్దరు పిల్లలను కూడా తీసుకుపోయిందని.. తన పిల్లలను తనకు అప్పగించాలని కోరాడు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

Next Story