300 ఏళ్లుగా స్నేక్ మేళా.. ఇంత భయంకరంగా జరిగే ఫెస్టివల్ ఎక్కడో తెలుసా?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-13 13:24:04  IST  )

300 ఏళ్లుగా బీహార్ స్నేక్ మేళా నిర్వహిస్తున్నారు...

300 ఏళ్లుగా స్నేక్ మేళా.. ఇంత భయంకరంగా జరిగే ఫెస్టివల్ ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: 300 ఏళ్లుగా బీహార్(Bihar)రాష్ట్రంలో స్నేక్ మేళా(Snake Mela) నిర్వహిస్తున్నారు. భక్తులు వందలాది పాములను మెడలో వేసుకుని జాతర నిర్వహిస్తున్నారు. నాగ పంచమి(Nagpanchami) పండుగ పాముల పండుగ అని అంటున్నారు. ఈ పండుగ వర్షపు నెలలలో వస్తుందని, ఈ సమయంలో పాము కాటుకు గురయ్యే అవకాశం ఉందని జాతర నిర్వహిస్తే అలాంటివి జరగవని భక్తులు నమ్ముతారు. పిల్లలు కూడా పాములను మెడకు చుట్టుకుని కనిపిస్తారు. ప్రతి ఏడాది నాగ పంచమి వేళ బీహార్‌లోని సమస్తిపూర్(Samastipur) జిల్లాలో ఈ జాతర జరుగుతోంది. సాంప్రదాయ బద్ధంగా నాగదేవతలకు పూజలు చేస్తారు. వందలాది మంది భక్తులు గండక్ నదిలో స్నానం చేసి తమ చేతుల్లో పాములను పట్టుకుని బయటకు వస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు.

అయితే పాములను పట్టుకురావడం దృశ్యాలను చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. జాతర ప్రారంభంలో సింఘియా బజార్‌లో ఉన్న ‘మా భగవతి’ ఆలయంలో పాము మంత్రగాళ్లు(Snake Charmers) ప్రార్థనలు చేసి, ఆపై గండక్ నదికి ఊరేగింపుగా వెళతారు. కొన్ని ఆచారాలను నిర్వహించిన తర్వాత నదిలో స్నానం చేస్తారు. ఆపై వారి చేతుల్లో ఉన్న పాములతో నది నుంచి బయటకు వస్తారు. ఇలా చేయడం జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Next Story