బీహార్‌లో దారుణం.. మతిస్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారం చేసిన వృద్ధుడు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-01 12:24:26  IST  )

బీహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌లోని భుస్రా చౌక్ దగ్గర మతిస్థితిమితం లేకుండా తిరుగుతున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడు 65 ఏళ్ల వృద్ధుడు. తన కామవాంఛకు అభం శుభం తెలియని అమ్మాయిని బలిపశువును చేశాడు.

బీహార్‌లో దారుణం.. మతిస్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారం చేసిన వృద్ధుడు..
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌లోని భుస్రా చౌక్ దగ్గర మతిస్థితిమితం లేకుండా తిరుగుతున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడు 65 ఏళ్ల వృద్ధుడు. తన కామవాంఛకు అభం శుభం తెలియని అమ్మాయిని బలిపశువును చేశాడు. ఓ దుకాణం బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ చేయబడింది. అనుకోకుండా ఈ వీడియో చూసిన దుకాణాదారుడు పోలీసులకు ఇన్‌ఫర్మ్ చేశాడు. అమ్మాయి బట్టలు లేకుండా తిరుగుతుండటంతో స్థానికులు బట్టలు వేయగా.. ఈ ఘటన ఓ గల్లీలో రెండు షాపుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ విజువల్స్ నిందితుడిని పట్టించాయి. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం, ఆందోళనకు దారితీసింది.

Next Story