- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: ఇదేం చెత్త పని సార్? రైలులో పల్లీలు తింటూ అక్కడే పొట్టు పడేసిన పోలీస్ అధికారి!
‘చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలి.. రైల్వే ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి’ ప్రయాణికులకు నిరంతరం వినిపించే సూచనలివి. సామాన్యులు పొరపాటు చేస్తే దండించే పోలీసులు, తామే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే? సరిగ్గా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ‘చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలి.. రైల్వే ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి’ ప్రయాణికులకు నిరంతరం వినిపించే సూచనలివి. సామాన్యులు పొరపాటు చేస్తే దండించే పోలీసులు, తామే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే? సరిగ్గా ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీహార్‌కు చెందిన ఓ పోలీసు అధికారి రైలులో ప్రయాణిస్తూ ప్రదర్శించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
వైరల్ వీడియో ప్రకారం.. రైలులో ప్రయాణిస్తున్న సదరు పోలీసు అధికారి ఫోన్ మాట్లాడుతూ.. పల్లీలు (వేరుశనగలు) తింటూ, వాటి పొట్టును ఏమాత్రం సంకోచం లేకుండా అక్కడే సీటు కింద, పరిసరాల్లో పడేస్తూ కనిపించారు. ఎదురుగా ఉన్న ప్రయాణికుడు ఈ తతంగం మొత్తాన్ని తన ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హుమ్ నహీ సుధ్రేంగే..
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘హుమ్ నహీ సుధ్రేంగే’ (మేము మారము) అని కొందరు అధికారి వైఖరిని ఎద్దేవా చేయగా, మరికొందరు వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదేం చెత్త పని సార్ అని మండిపడ్డారు. ఈ మేరకు రైల్వే మంత్రిని, బీహార్ పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు లేదా బీహార్ పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. రైళ్లలో ప్రయాణించేటప్పుడు బిస్కెట్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేయడం కనీస బాధ్యత.. సామాన్యులకు బుద్ధి చెప్పాల్సిన అధికారులే ఇలా నిబంధనలు తుంగలో తొక్కడం విచారకరమని నెటిజన్‌లు చెబుతున్నారు.






