ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లో కొత్త వివాదం.. తేజస్వీ యాదవ్‌పై కేసు

by Naga Rani Yarlagadda |

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సమయం సమీపిస్తున్న వేళ.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లో కొత్త వివాదం.. తేజస్వీ యాదవ్‌పై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సమయం సమీపిస్తున్న వేళ.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేయిస్తామని చెప్పి.. తన వద్దనుంచి రూ.200 తీసుకున్నారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) సహా.. రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్, మాజీ ఆర్జేడీ ఎమ్మెల్యే రిషీ మిశ్రా, మాజీ కాంగ్రెస్ అభ్యర్థి మస్కూర్ అహ్మద్ ఉస్మానీల పేర్లను పేర్కొంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సింగ్వారా పోలీస్ స్టేషన్లో పోలీసులు సదరు నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సింగ్వారా పీఎస్ పరిధిలోని (Singwara Police Station) వార్డు నెంబర్ 7లో నివాసం ఉంటున్న గుడియా దేవి (Gudiya Devi) తనను నేతలు మోసం చేశారని ఆరోపించింది. మై బహన్ యోజన కింద మహిళలకు రూ.2500 ఇస్తామని హామీ ఇవ్వగా.. దానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో తన వద్ద రూ.200 తసుకుని మోసం చేసినట్లు తెలిపింది. పథకాల పేరుతో మహిళల ఆధార్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు, మొబైల్ నంబర్లను సేకరించారని చెప్పారు.

Next Story