- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kumbh Mela: బస్సు, రైలు, విమానం కాదు.. కుంభమేళాకు ఎలా వెళ్లారంటే?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళాకు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. దీ

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళాకు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో, ప్రయాగ్ రాజ్ వెళ్లడం దాదాపు కష్టంగా మారింది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట ఘటనతో ట్రైన్లలో వెళ్లేందుకు జంకుతున్నారు. విమాన ప్రయాణం మరింత కాస్ట్ లీగా మారింది. ఈ క్రమంలోనే బిహార్ కు చెందిన కొందరు యువకులు మహాకుంభమేళాకు ప్రత్యేక మార్గంలో వెళ్లారు. ఈ తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ ప్రాంతం నుంచి త్రివేణి సంగమం వరకు 550 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బక్సర్‌కు చెందిన ఏడుగురు యువకుల బృందం మహా కుంభమేళా కోసం పడవను రవాణా మార్గంగా వాడుకున్నారు. పడవలో రెండు రోజులు ప్రయాణించి కుంభమేళా చేరుకున్నారు. యువకుల పడవ ప్రయాణం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పడవప్రయాణం
సుఖ్‌దేవ్ చౌదరి నేతృత్వంలో బృందం ఫిబ్రవరి 11న బక్సర్ నుంచి పడవలో ప్రయాగ్ రాజ్ బయల్దేరింది. రేషన్, నీరు, ఇంధన సహా అవసరమైన సామగ్రిని తీసుకెళ్లింది. పడవ కోసం రెండు బ్యాకప్ మోటర్లు కూడా తీసుకెళ్లారు. కానీ, కొన్నిసార్లు మోటార్లు వెడెక్కడంతో 5-6 కిలోమీటర్ల దూరం పడవను మాన్యువల్ గానే నడపాల్సి వచ్చిందని ఆ యువకులు తెలిపారు. రాత్రుళ్లు షిఫ్టుల మాదిరిగా పడవను నడిపినట్లు తెలిపారు. ఫిబ్రవరి 13న తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్ సంగమంలో పవిత్రస్నానం చేశామన్నారు. పెట్రోల్, ఆహారం, ఇతర సామగ్రి కలిపి మొత్తం ప్రయాణానికి దాదాపు రూ. 20,000 ఖర్చయినట్లు వెల్లడించారు. ఇకపోతే, జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటికే 55 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.






