- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: న్యాయం చేయండి.. రాహుల్ గాంధీ వల్ల రూ.250 నష్టపోయా..
కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బిహార్కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశాడు. సోనుపుర్ గ్రామ నివాసి ముకేష్ చౌదరి కోర్టుని ఆశ్రయించాడు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బిహార్కు చెందిన ఓ వ్యక్తి కేసు వేశాడు. సోనుపుర్ గ్రామ నివాసి ముకేష్ చౌదరి కోర్టుని ఆశ్రయించాడు. దేశంతో పోరాడుతున్నామని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యల వల్ల ఐదు లీటర్ల పాలు కిందపడిపోయాయని కేసు వేశాడు. పాలు పడిపోవడం వల్ల తనకు రూ.250 నష్టం వాటిల్లిందని రోసెరా సబ్ డివిజన్‌లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివిధ సెక్షన్ల కింద రాహుల్పై విచారణ కోరుతూ ఫిర్యాదు చేశారు. రాహుల్ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ వల్ల తనకు రూ.250 నష్టం వాటిల్లిందని అన్నాడు. కాగా.. ఆ పిటిషన్‌ను కోర్టు అంగీకరించిందో లేదో తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే?
జనవరి 15న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. ఆ సమయంలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయని ఆరోపించారు. తాము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తోపాటు భారత రాజ్యంతో పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. కాగా.. ఆ వ్యాఖ్యలు వినే తాను షాక్ కు గురైనట్లు ముకేష్ చౌదరి పేర్కొన్నారు. అందుకే, కోర్టుని ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం చెలరేగింది. అసోంకు చెందిన మోంజిత్ చెటియా ఆయనపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో దేశంలో అశాంతి, వేర్పాటువాద భావాలను రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.






