Bihar: ట్రాఫిక్ చలాన్లు పంపి భార్యపై ప్రతీకారం తీర్చుకున్న భర్త

by Shamantha N |

బిహార్ కు చెందిన యువకుడు విడాకులు కావాలంటున్న భార్యపై వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమె పేరుతో న్న బైక్ తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి.. జరిమానాల భారం వేశాడు.

Bihar: ట్రాఫిక్ చలాన్లు పంపి భార్యపై ప్రతీకారం తీర్చుకున్న భర్త
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్(Bihar) కు చెందిన యువకుడు విడాకులు కావాలంటున్న భార్యపై వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమె పేరుతో న్న బైక్ తో ట్రాఫిక్ ఉల్లంఘనలకు(traffic rules) పాల్పడి.. జరిమానాల భారం వేశాడు. కాగా.. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువతికి, బిహార్‌లోని పాట్నాకు చెందిన యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లి అయిన నెల రోజులకే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో, యువతి పుట్టింటికి వెళ్లడమే కాకుండా భర్తకు విడాకుల నోటీసులు పంపింది. ప్రస్తుతం ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే, పెళ్లి సమయంలో యువకుడికి యువతి తల్లిదండ్రులు బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, బైక్ ని మాత్రం యువతి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా.. ఆమె పుట్టింటికి వెళ్లేటప్పుడు బైక్ ని అతడు తిరిగి ఇవ్వలేదు. భార్య వెళ్లిపోయాక.. ఆ బైక్ తో ట్రాఫిక్ ఉల్లంఘనటలకు పాల్పడ్డాడు. దీంతో, ఆ చలానాలను ట్రాఫిక్ పోలీసులు యువతికి పంపించారు.

పోలీసులను ఆశ్రయించిన యువతి

అయితే, తన పేరు మీద బైక్ ఉండటంతో ఆమె తొలుత సమయం ప్రకారం చలానాలను కట్టేసింది. అయితే వరుసగా చలానాల భారం పెరుగుతుండటంతో భర్త కుట్ర అర్థమై ఆమె పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. గత మూడు నెలల్లోనే నాలుగు సార్లు చలానాలు వచ్చాయని ఆమె వాపోయింది. ఆ యువకుడు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ భార్యను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంతేకాకుండా విడాకులు మంజూరు అయ్యే వరకూ బైక్ ఇచ్చేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు. భర్త చేస్తున్న వేధింపులు తట్టుకోలేక ఆమె తొలుత పాట్నా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో.. ముజాఫర్ పూర్ లోని పీఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది. అయితే, భర్తే బైక్ నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఒక అఫిడవిట్ సమర్పించాలని పోలీసులు ఆమెకు సూచించారు. కాగా.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story