IG Sunil Naik Case: ఏపీ పోలీసులకు షాక్.. బిహార్ సర్కార్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |

బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ కేడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

IG Sunil Naik Case: ఏపీ పోలీసులకు షాక్.. బిహార్ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ హోంశాఖ(Bihar Home Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. బిహార్ కేడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ సునీల్ నాయక్(IG Sunil Naik) ఘటనతో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐజీ స్థాయి అధికారి పట్ల ఏపీ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే పాట్నా పివిల్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాల అరెస్ట్ సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు వర్తింపచేస్తూ బిహార్ సర్కార్ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నిందితుడిగా ఉన్న బిహార్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్నాయక్ అరెస్టుకు వారంట్ జారీ అయినా.. చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బిహార్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story