పెళ్లిలోనే అది అడిగాడు, పెళ్లికూతురికి తిక్క‌రేగింది! ఉమెన్స్ డేలో వైరల్ వీడియో

by Disha Web Desk 20 |
పెళ్లిలోనే అది అడిగాడు, పెళ్లికూతురికి తిక్క‌రేగింది! ఉమెన్స్ డేలో వైరల్ వీడియో
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఓ వీడియో చక్క‌ర్లు కొడుతోంది. ఇండియాలో వివాహాలు ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో అంత దుర్మార్గాలు అందులో క‌నిపిస్తాయి. మహిళల సాధికారతను గురించి మాట్లాడే వాళ్లు కూడా పెళ్లికి క‌ట్నం ఇవ్వ‌డ‌మో, పుచ్చుకోవ‌డ‌మో త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొంటాయి. అయితే, ఈ వైర‌ల్ వీడియోలో ఏకంగా పెళ్లి పీట‌ల మీదే వ‌రుడు ఇస్తాన‌న్న క‌ట్నం అంతా అణా పైస‌ల‌తో స‌హా ఇప్పుడే ఇవ్వాల‌ని కూర్చుంటాడు. దాదాపుగా దాని మీద ఒక లెక్చ‌రిచ్చేస్తాడు.

బీహార్‌కు చెందిన ఈ వీడియోలో త‌న కుటుంబం అడిగిన క‌ట్న‌మంతా ఇవ్వ‌క‌పోతే వ‌చ్చిన 'బారాత్' వెంటే తిరిగెళ్లిపోతానంటాడు పెళ్లికొడుకు. క‌ట్నం అంద‌రూ తీసుకుంటున్నార‌నీ, వ‌ర‌క‌ట్న వ్య‌వ‌స్థ లేనిది ఎక్క‌డా చెప్పండి? 'దొరికితే దొంగ దొర‌క్క‌పోతే దొర' అంతే త‌ప్ప ఇదేమీ త‌ప్పుకాదంటూ స‌మ‌ర్థించుకుంటాడు. పెళ్లికొడుకు మాట‌ల‌కు తిక్క‌రేగిన పెళ్లికూతురు... ఇందేంది..?! కొంత ఇచ్చాము మిగితాది త‌ర్వాత ఇస్తామ‌ని చెప్పిన త‌ర్వాత ఒప్పుకునే క‌దా పెళ్లిలో కూర్చున్నావ్‌. ఇప్పుడు పీట‌ల మీద అడిగితే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తుంది. అయినా, వినిపించుకోని వ‌రుడు "ఔకత్"కి త‌గ్గ‌ట్టే చేసుకోవ‌ల్సింద‌నీ, "వాళ్ళకంటే మంచి వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు, డబ్బులు కట్టలేని వాళ్ళు దగ్గరికి వెళితే పెళ్ళి ఎలా జరుగుతుంది?" అంటూ వీర లెవ‌ల్లో ప్రేల‌ప‌న‌లు పేల‌తాడు.

చివ‌రికి, వ‌రుడు త‌న తండ్రిని ఒప్పిస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్ప‌డంతో వధువు కుటుంబం, బంధువులు కాళ్లావేళ్లాప‌డి ఒప్పిస్తారు. మొత్తానికి పెళ్లి పూర్త‌య్యింది కానీ ఈ వీడియో సోష‌ల్ మీడియాలోకి చేరింది. ఇప్పుడు అత‌న్ని అరెస్ట్ చేయాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. వరకట్నం, భారతదేశంలో చట్టబద్ధంగా నిషేధించబడినప్పటికీ, ప్రబలంగానే కొనసాగుతోంది. వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం, ఎవరైనా వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం లేదా అలాంటి చర్యలకు సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.15,000 కంటే తక్కువ జరిమానా లేదా కట్నం విలువ (ఏది ఎక్కువైతే అది)కి శిక్షార్హులు. అయినా, ఇలాంటి వారు ఉంటూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నిజ‌మైన ఉమెన్స్‌డే ఇండియాలో ఎప్పుడు సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.


Next Story

Most Viewed