- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఇకపై సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలంటే పర్మిషన్ ఉండాల్సిందే..
సోషల్ మీడియా వాడే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయాలంటే ఇకపై పర్మిషన్ తీసుకోవాలని తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వాడే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయాలంటే ఇకపై పర్మిషన్ తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు బీహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను సోషల్ మీడియా వాడకుండా నిషేధించడం దీని ఉద్దేశ్యం కాదని, వారు హుందాగా నడుచుకునేలా చూడటమే ముఖ్య ఉద్దేశ్యమని వివరించింది. ఉద్యోగులు సోషల్ మీడియా వాడటంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఏ ఉద్యోగి అయిన సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే సంబంధిత శాఖకు చెందిన అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. అలాగే నకిలీ ఖాతాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల హోదా, ప్రభుత్వ లోగోలతో ఎలాంటి పోస్టులూ చేయకూడదు. పర్సనల్ సోషల్ మీడియా అంకౌట్లకు గవర్నమెంట్ కు చెందిన ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు వాడకూడదు. అశ్లీలత, కుల, మతాలపై చేసే పోస్టులు పూర్తిగా నిషేధం. అధికారిక సమావేశాలు, వీడియోలు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు. ఉద్యోగులు ఎలాంటి కంటెంట్ షేర్ చేయవచ్చన్నదానిపై పూర్తి స్పష్టతతో మార్గదర్శకాలు రూపొందించినట్లు బిహార్ ప్రభుత్వం తెలిపింది.






