Bihar: 24 గంటల్లోనే నాలుగు హత్యలు.. బిహార్‌లో కలకలం

by B.Srinivas |

అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వరుస హత్యలు కలకలం రేపాయి.

Bihar: 24 గంటల్లోనే నాలుగు హత్యలు.. బిహార్‌లో కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వరుస హత్యలు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలోనే నాలుగు మర్డర్లు జరిగాయి. శనివారం ఓ వ్యాపారవేత్తను మొదటగా హత్య చేయగా ఆదివారం జితేంద్రకుమార్ మహతో అనే న్యాయవాదిని కాల్చి చంపారు. పాట్నాలోని సుల్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ఘటన జరిగింది. జితేంద్ర టీ తాగి తిరిగి వస్తుండగా ఆయనపై నిందితులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. పాట్నా తూర్పు ఎస్పీ పరిచయ్ కుమార్ ఘటనను ధ్రువీకరించారు. అంతకుముందు సీతామర్హి జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతమైన మెహసౌల్ చౌక్ వద్ద గుర్తు తెలియని దుండగులు వ్యాపారవేత్త పుతు ఖాన్‌ను కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పాట్నా జిల్లాలోని షేక్ పురా గ్రామంలో సురేంద్ర కేవత్ అనే పశువైద్యుడిని, రామకృష్ణ నగర్‌లో నివాసముందడే విక్రమ్ ఝా అనే వ్యక్తిని హత్య చేశారు. దీంతో పాట్నాలో భయాందోళనలు నెలకొన్నాయి.

వరుస హత్యల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరోవైను ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్‌జేపీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘ఇంకా ఎంతమంది బీహారీలు హత్యలకు గురవుతారు? ఇది అర్థం చేసుకోలేనిది’ అని పేర్కొన్నారు.

Next Story