- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prashant Kishore: బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది: ప్రశాంత్ కిశోర్
బిహార్ ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ బాంబు పేల్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Election s) చక్రం తిప్పాలని భావించి చతికిలపడిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ (Rigging) జరిగిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడో తప్పు జరిగిందని సందేహం వ్యక్తం చేసిన ఆయన ఈ విషయాన్ని నిరూపించేందుకు తన వద్ద సరైన ఆధారాలు లేవనన్నారు. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పార్టీలకు కూడా లక్షల ఓట్లు రావడంపై అనుమానాలు కలిగిస్తోందన్నారు.
పోలింగ్‍కు ముందు తమ బృందం సేకరించిన ప్రజాభిప్రాయానికి, ఎన్నికల ఫలితాలకు అసలు సంబంధమే లేదని, బిహార్ ఫలితాలు ప్రజాభిప్రాయానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడం బాధ కలిగించిందన్నారు. అయితే ఈ ఓటమితో తన పొలిటికల్ కెరీర్ ముగియలేదని వచ్చే ఐదేళ్లు బిహార్ లోనే ఉంటానని ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తానన్నారు. ఈవీఎంలు తారుమారు చేశారని చెప్పాలని కొందరు నన్ను అడుగుతున్నారు. అయితే ఓడిన తర్వాతచేసే ఆరోపణలు ఇవేనన్నారు. కాగా రెండు విడుదతల్లో జరిగిన బిహార్ ఎసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడయ్యాయి. ఇందులో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 238 స్థానాల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ పోటీ చేసినా కనీసం ఖాతా కూాడా తెరవలేకపోయింది.






