- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు అమ్మాయిలకు చదువు అవసరమా? బిహార్ విద్యాశాఖమంత్రి సంచలన వ్యాఖ్యలు
బాలికల విద్యపై బిహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ లో ఉపాద్యాయ నియామక పరీక్ష నిర్వహించడం ఆలస్యం అవ్వడంతో పాట్నాలో టీచర్ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: బాలికల విద్యపై బిహార్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ లో ఉపాద్యాయ నియామక పరీక్ష నిర్వహించడం ఆలస్యం అవ్వడంతో పాట్నాలో టీచర్ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో పాటు కాళ్లతో తొక్కారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమయంలో మహిళా పోలీసులు లేకపోవడంతో మగ పోలీసులే నిరసన వ్యక్తం చేస్తున్న అమ్మాయిలను అడ్డుకుని వారిపైనా లాఠీ ఛార్జ్ చేశారు. ఇటీవలే బిహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడగా ప్రభుత్వ తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఇదే ఘటనపై బీజేపీ నేత, బిహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ మీడియాతో మాట్లాడుతూ... అసలు అమ్మాయిలకు చదువు ఏం అవసరం? మన ఇంటి ఆడబిడ్డలే మనశక్తి. వాళ్లే మన శ్రేయస్సుకు పునాది అని అన్నారు. నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం నిలబడితే ఆడపిల్లలు ఎందుకు రోడ్లపైకి రావాలని వ్యాఖ్యానించారు. మిథిలేష్ చేసిన వ్యాఖ్యలు బిహార్ లో వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ వీడియోను షేర్ చేస్తూ.. మొన్నటి వరకు నితీష్ కుమార్ బిహార్ విద్యావ్యవస్థను నాశనం చేస్తే ఇప్పుడు తివారీ పూర్తిగా భూస్థాపితం చేసేందుకే వచ్చాడంటూ విమర్శిస్తున్నారు.






