- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా డాక్టర్ హిజాబ్ లాగిన సీఎం! తీవ్ర వివాదంలో బీహార్ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నియమితులైన ఆయుష్ (AYUSH) డాక్టర్లకు నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా, ఒక మైనారిటీ మహిళా డాక్టర్ హిజాబ్‌ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళా ఆయుష్ డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్‌ను చూసిన సీఎం నితిష్, దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో కొందరు నవ్విన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనతో ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కన్పించింది. ఈ ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) నితీష్ కుమార్‌ను తీవ్రంగా విమర్శించింది. నితీష్ జీకి ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా? లేక ఇప్పుడు ఆయన పూర్తిగా ‘సంఘీ’గా మారిపోయారా? అంటూ ఆర్జేడీ విమర్శించింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సైతం ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే, రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చని తెలిపింది. ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై బీహార్ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, సీఎంవో నుంచి ఇప్పటి వరకు అధికారిక వివరణ వెలువడలేదు. వీడియో ఇదే..






