- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీతో పొత్తు కంటే చావు మేలు.. బిహార్ సీఎం అనూహ్య వ్యాఖ్యలు
బీజేపీతో పొత్తుపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీతో పొత్తుపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్డీఏలో తాము భాగస్వామిగా ఉన్న సమయంలో కేవలం బీజేపీ మాత్రమే లాభపడిందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాల్లో 36 చోట్ల తమ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. అంతేగాక, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పైన వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి చెందక పోగా.. మరింత వెనక్కి వెళుతోందని మండిపడ్డారు. మరోసారి బీజేపీతో జతకట్టడం కంటే చనిపోవడమే మేలని అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
Next Story






