- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nitish : బిహార్‌లో ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్థిగా నితీశ్
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్(Bihar)లో వచ్చే సంవత్సరం (2025లో) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర బీజేపీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్(Bihar)లో వచ్చే సంవత్సరం (2025లో) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర బీజేపీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి తరఫున నితీశ్ కుమార్‌ను సీఎం అభ్యర్థిగా చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని బిహార్ బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన ఈ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.
సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే(Nitish)నని.. అందులో ఎలాంటి మార్పు ఉండదని తీర్మానంలో ప్రస్తావించారు. బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఈవివరాలను మీడియాకు వెల్లడించారు. బిహార్ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉండాలనే దానిపై ఎన్డీయే కూటమిలోని ఐదు మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని బిహార్ మంత్రి ప్రేమ్‌కుమార్ తెలిపారు.
Next Story






