- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో మైక్ విరిచేసిన ఎమ్మెల్యే.. సరిచేసే క్రమంలో ఊడిపోయిందంటూ కవరింగ్!
బిహార్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే లాఖేంద్ర రౌషన్ మాట్లాడుతున్న... Bihar BJP MLA Seen Ripping Off Mic, Insists "It Came Off On Its Own"

పాట్నా: బిహార్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన పని వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే లాఖేంద్ర రౌషన్ మాట్లాడుతున్న సమయంలో ఆగ్రహంతో మైక్ విరిచేశారు. ఇది కాస్తా ప్రభుత్వ ఆగ్రహానికి దారి తీసింది. బీజేపీ గుండాలు సభలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. విధాన సభలో ప్రశ్నలకు సమాధానంలో ఇచ్చే సమయంలో రౌషన్ హింసాత్మకంగా ప్రవర్తించారని డిప్యూటీ సీఎం కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది. బీజేపీకి ప్రజాస్వామ్యం, చర్చ, స్థానికతపై ఎలాంటి విశ్వాసం లేదని ఆరోపించారు. అదే సమయంలో సీపీఎం శాసనసభ్యులతో వాగ్విదాం చోటుచేసుకున్నట్లు విలేకరులకు తెలిపారు. సభ్యులు దుర్భలాషలాడరని చెప్పారు. ఈ క్రమంలో సభలో అన్ని హద్దులు దాటిపోయారని మంత్రి కుమార్ సర్వజీత్ అన్నారు. సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మార్షల్స్ వచ్చి అదుపు చేశారు. మరోవైపు మైక్‌ను సరి చేసే సమయంలో అది బయటకు వచ్చిందని ఎమ్మెల్యే రౌషన్ అన్నారు.






