Bihar: మూడు విడతల్లో బిహార్ ఎన్నికలు.. షెడ్యూల్ రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

by B.Srinivas |

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 5 ,15 మధ్య నిర్వహించే చాన్స్ ఉంది.

Bihar: మూడు విడతల్లో బిహార్ ఎన్నికలు.. షెడ్యూల్ రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 5 ,15 మధ్య ఎలక్షన్స్ నిర్వహించే చాన్స్ ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వచ్చే వారం బిహార్ లో పర్యటించి ఎన్నికల సన్నాహాలను, ఈ నెల 30న ప్రచురించబడే తుది ఓటర్ల జాబితాను సమీక్షిస్తారని వెల్లడించాయి. అనంతరం షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. 243 నియోజకవర్గాలున్న బిహార్‌లో గత శాసనసభ ఎన్నికలు సైతం మూడు దశల్లో జరిగాయి. 2015లో ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. అయితే ఈసారి కూడా మూడు విడతల్లోనే నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఆ తేదీకి ముందే పోల్ ప్యానెల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎస్ఐఆర్ వివాదం, ప్రతిపక్షాలు చేస్తున్న ఓటు చోరీ ఆరోపణల నేపథ్యంలో బిహార్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story