బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 47.62% ఓటింగ్

by Malleboina Mahesh |

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో ఓటింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 47.62% ఓటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) రెండో విడతలో ఓటింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు 31 శాతం రికార్డు పోలింగ్ నమోదు అయింది. దీంతో ఈ సారి బీహార్ ఎన్నికల పోలింగ్ రికార్డులు బ్రేక్ చేసే విధంగా ముందుకు సాగుతుందని అంతా అంచనా వేశారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 47.62% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

ప్రస్తుతం ప్రజలు పండగ వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే, కిషన్గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86% ఓటింగ్ నమోదైంది. దాని తర్వాత గయా (50.95%), జముఈ (50.91%) మరియు బంకా (50.07%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. మరోవైపు మధుబనీ (43.39%) మరియు నవాడా (43.45%) జిల్లాల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. ఇతర జిల్లాలు 45% నుండి 49% మధ్యలో ఉన్నాయి. మొత్తంగా పోలింగ్ శాతం పెరుగుతుందనే అంచనా వ్యక్తమవుతుండగా.. ఎన్నికల అధికారులు శాంతియుతంగా, విఘాతం లేకుండా ఎన్నికలు సాగుతున్నాయని తెలిపారు.

Next Story