Bihar Assembly: నిజమైన అమిత్ షా మాట.. షాక్‌లో మహాగఠ్‌బంధన్‌ శ్రేణులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 05:50:41  IST  )

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించి సంచలనాలు నమోదవుతున్నాయి.

Bihar Assembly: నిజమైన అమిత్ షా మాట.. షాక్‌లో మహాగఠ్‌బంధన్‌ శ్రేణులు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించి సంచలనాలు నమోదవుతున్నాయి. ఎన్‌డీఏ కూటమి 190 స్థానాల్లో అప్రతిహతంగా అధిక్యంలో దూసుకెళ్తోంది. మరోవైపు 41 స్థానాల్లో మహాగఠబంధన్ కూటమి అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు. ఈ క్రమంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వాఖ్యలు అక్షరాల నిజం అయ్యాయి. ఎన్‌డీఏ 160 పైగా సీట్లు గెలుచుకుంటుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిహార్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించనుంది. కాగా, 2020లో బీజేపీ కంటే ఒక్క సీటు ఎక్కువగా గెలుచుకుని ఆర్జేడీ 75 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

పాపం ప్రశాంత్ కిషోర్.. కనీసం ఒక్క ఆధిక్యం కూడా లేదు

Next Story