Bihar: బిహార్‌లో 61 లక్షల ఓట్లు తొలగింపు.. ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం

by B.Srinivas |

భారత ఎన్నికల సంఘం బిహార్ ఓటర్ల జాబితా నుంచి 61.1 లక్షల మంది ఓటర్లను తొలగించనుంది.

Bihar: బిహార్‌లో 61 లక్షల ఓట్లు తొలగింపు.. ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల సంఘం బిహార్ ఓటర్ల జాబితా నుంచి 61.1 లక్షల మంది ఓటర్లను తొలగించనుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో భాగంగా గణన ఫారాలను సమర్పించడానికి గడువుకు ఒక రోజు ముందే వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. లిస్టు నుంచి తీసేసే ఓటర్లలో 21.6 లక్షల మంది మరణించారని, 31.5 లక్షల మంది శాశ్వతంగా బిహార్ వదిలి వెళ్లారని, 7 లక్షల మంది రెండు ప్రదేశాలలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, లక్ష మంది ఆచూకీ తెలియడం లేదని ఈసీ పేర్కొంది. భారీగా ఓటర్లను తొలగిస్తే బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 25,144 పేర్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. దీంత త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక స్థానాల్లో పలువురు అభ్యర్థులు స్వల్ప తేడాతో విజయం సాధించారని ఓట్లు తీసేస్తే అభ్యర్థులపైనా ప్రభావం పడే చాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఈసీ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిని తొందర పాటు చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటులోనే నిరసన తెలుపుతున్నాయి.

Next Story