అందాలు చూపిస్తూ లక్షల్లో దోపిడీ.. పురుషులే టార్గెట్‌గా ఇన్‌స్టాలో భారీ స్కామ్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-15 06:05:04  IST  )

ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది పత్తేపారానికి తెరలేపారు. అందాలనే పెట్టుబడి పెడుతూ పురుషుల వీక్ నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. అలా క్యాష్ చేసుకుంటున్నవారిలో సాధారణ మహిళల నుండి సెలబ్రెటీల వరకు ఉన్నారు. నిజానికి అది క్రైమ్ కాదు కానీ అందాలు చూపిస్తూ వాళ్లు చేసే దోపిడీ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

అందాలు చూపిస్తూ లక్షల్లో దోపిడీ.. పురుషులే టార్గెట్‌గా ఇన్‌స్టాలో భారీ స్కామ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇటీవల కరీంనగర్‌లో ఓ మహిళ ఇన్ స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ పురుషులనే టార్గెట్ చేసుకుని డబ్బులు సంపాదిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భర్త సపోర్ట్‌తోనే మహిళ ఈ పనిచేస్తోదంటూ పోలీసులు వెల్లడించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే కేవలం ఒకరిద్దరు కాదు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చాలా మంది మ‌హిళ‌లు పురుషులను టార్గెట్ చేస్తూ పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక కొత్తగా మరో పత్తేపారానికి సైతం తెరలేపారు. అందాలనే పెట్టుబడి పెడుతూ పురుషుల వీక్ నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. అలా క్యాష్ చేసుకుంటున్నవారిలో సాధారణ మహిళల నుండి సెలబ్రెటీల వరకు ఉన్నారు. నిజానికి అది క్రైమ్ కాదు కానీ అందాలు చూపిస్తూ వాళ్లు చేసే దోపిడీ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సాధారణంగా ఇన్ స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే సబ్ స్క్రిప్షన్ అనే మరో అప్డేట్ ను ఇన్ స్టా మాతృ సంస్థ మెటా తీసుకువ‌చ్చింది. క్రియేట‌ర్లు డ‌బ్బులు సంపాదించుకునేందుకు ఈ ఆప్ష‌న్ తీసుకువ‌చ్చారు. దీని ద్వారా స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకున్న‌వాళ్ల కోసం క్రియేట‌ర్లు ఎక్స్ క్లూజివ్ కంటెట్ క్రియేట్ చేసి ప‌బ్లిష్ చేస్తారు. అది సాధార‌ణ ఫాల‌వ‌ర్స్ కు క‌నిపించ‌దు. ఆ కంటెంట్ చూడాలంటూ క‌చ్చితంగా స‌బ్ స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు కొంత‌మంది మ‌హిళ‌లు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు.

అందాలు చూపించి అడిక్ట్ అయ్యేలా చేసి

ముందుగా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ఫాలోయింగ్ పెరిగిన త‌ర‌వాత స‌బ్ స్క్రైబ్ చేసుకున్న‌వాళ్ల‌కు ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అంటూ మ‌గ‌వాళ్ల వీక్ నెస్ ఆస‌రాగా తీసుకుని డ‌బ్బులు సంపాదిస్తున్నారు. ఇందులో సెమీ న్యూడ్ ఫోటోల నుండి న్యూడ్ ఫోటోల‌ను షేర్ చేస్తూ భారీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నారు. నిజానికి ఒక స‌బ్ స్క్రిప్షన్ కు అయ్యేది కేవ‌లం రూ.100 నుండి రూ.200 వ‌ర‌కే. ఇలా త‌క్కువే కాబ‌ట్టి అందులో దోచుకునేంది ఏముందు అనే అనుమానం రావ‌చ్చు. అయితే రూ.200 వ‌సూలు చేసేది ఒక వ్య‌క్తి నుండే.. కానీ వంద‌ల నుండి వేల మంది అలాంటి కంటెంట్ కు అల‌వాటుప‌డి సబ్ స్క్రైబ్ చేసుకోవ‌డంతో వేలు, ల‌క్ష‌ల్లో డ‌బ్బులు సంపాదిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఓ యువతికి ఇన్ స్టాలో 280 మంది సబ్ స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ చూడాలి అంటే వాళ్లు నెల‌కు రూ.180 చెల్లించాలి. 280 మంది నుండి ప్ర‌తినెల రూ.180 దోచుకుంటే ఆ యువ‌తి ఆదాయం నెల‌కు రూ.50,400 అవుతుంది. ఏడాదికి దాదాపు 6ల‌క్ష‌లు వ‌స్తుంది. ఇలా ల‌క్ష‌ల్లో దోచుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో వ‌య‌సుకు ఎలాంటి ప‌రిమితులు లేవు. ఎవ‌రైనా వాడుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఇలాంటి స‌బ్ స్క్రిప్ష‌న్ ల వ‌ల్ల‌ చిన్న‌పిల్ల‌లు సైతం అడ‌ల్ట్ కంటెంట్ కు అలవాటు ప‌డే ప్రమాదం ఉంది.

ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ వెనుక మరో దందా

అంతే కాకుండా ఎక్స్ క్లూజివ్ కంటెంట్ మాటున మ‌రో దందాకు కూడా తెర‌లేపుతున్నారు. స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకున్న పురుషుల‌తో వీడియో కాల్స్ మాట్లాడుతూ డ‌బ్బులు దోచుకోవ‌డామే కాకుండా వాటిని రికార్డ్ చేసి త‌ర‌వాత అధిక డ‌బ్బులు వ‌సూలు చేస్తూ వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌వాళ్లు సైతం ఉన్నారు. చాలా మంది పురుషులు త‌మ‌కు తెలియ‌కుండానే ఇలాంటి ఉచ్చులో చిక్కుకుని బ‌య‌ట‌కు చెప్పుకోలేక ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు సైతం అనేకం ఉన్నాయి. కాబ‌ట్టి మోస‌పోవ‌ద్దు అంటే పురుషులు ఇలాంటి కంటెంట్ క్రియేట‌ర్ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. అందాలు చూసి సబ్ స్క్రిప్ష‌న్ చేసుకుంటే డ‌బ్బులే కాకుండా చివ‌ర‌కు ప‌రువు, ప్రాణాలు అన్నీ పోయే ప్ర‌మాదం ఉంది.

Next Story