NEET (UG) ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. NTA సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |

నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామ్ ఫలితాల విడుదలకు ఎన్‌టీఏ (NTA) ముహూర్తం ఫిక్స్ చేసింది.

NEET (UG) ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. NTA సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ (NEET UG 2026) రీ ఎగ్జామ్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జూన్ 21న నిర్వహించిన పరీక్షా ఫలితాను జూలై 20 లోపు విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. వాస్తవానికి పరీక్ష పూర్తయిన 45 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారని, అయితే ఈసారి విద్యార్థుల విద్యా సంవత్సరం (Academic Session) ఆలస్యం కాకుండా ఉండేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి, జూలై 20లోపే ఫలితాలను ప్రకటిస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మే 3న జరిగిన అసలు పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్‌టీఏ జూన్ 25న విడుదల చేసిన ప్రాథమిక ‘ఆన్సర్ కీ’పై విద్యార్థుల నుంచి దాదాపు 10 వేల అభ్యంతరాలు వచ్చాయి. విద్యార్థులు సమర్పించిన ఆధారాలను నిపుణుల కమిటీ ప్రస్తుతం వన్ బై వన్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తుది ఫలితాలను విడుదల చేయనున్నట్లుగా ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

సకాలంలోనే ఎంబీబీఎస్ క్లాసులు..

ఫలితాల అనంతరం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు, అలాగే ఆయా రాష్ట్రాలు 85 శాతం స్టేట్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. కౌన్సెలింగ్ ప్రక్రియకు దాదాపు నెల రోజులకు పైగా సమయం పట్టినప్పటికీ, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ఎప్పటిలాగే ఆగస్టు, సెప్టెంబర్ కల్లా నిర్దేశిత సమయానికి ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు.

Next Story