Tariffs: భారత్ కు బిగ్ రిలీఫ్!.. టారిఫ్ లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-16 09:29:01  IST  )

పుతిన్ తో భేటీ నేపథ్యంలో భారత్ పై సుంకాల విషయంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tariffs: భారత్ కు  బిగ్ రిలీఫ్!.. టారిఫ్ లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్ పై విధించిన 25 శాతం అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని నేను అనుకోవడం లేదని దీనిపై మరో రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించడమే లక్ష్యంగా అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ భేటీ (Putin-Trump meeting) అయ్యారు. వీరి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ భేటీ సజావుగా జరిగిందని రష్యా చమురు (Russian oil) కొనుగోలు విషయంలో పునరాలోచన చేస్తామని చెప్పడం ఆసక్తిగా మారింది. దీంతో ఈ అదనుప టారిఫ్ ల అంశంపై ట్రంప్ వెనక్కి తగ్గినట్లుగా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. అయితే పుతిన్ తో భేటీకి ముందు ట్రంప్ మాట్లాడుతూ రష్యా చమురు అంశంపై మాట్లాడారు. భారత్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన రష్యా తన చమురు క్లయింట్ ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

భారత్ స్పందనపై ఉత్కంఠ:

అయితే ప్రస్తుతానికి భారత్, చైనా లాంటి దేశాలపై అదనపు టారిఫ్ లు విధించే ఉద్దేశం లేదని ట్రంప్ వ్యాఖ్యానించడంతో పాటు భారత్ ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్ ను కోల్పోయిందని వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. రష్యా చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ భారత్ ను ఉద్దేశిస్తూ రష్యా తన చమురు క్లయింట్ ను కోల్పోయిందిని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే అమెరికా టారిఫ్ లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఏఎస్ సాహ్ని వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దుని కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదన్నారు. అయితే ట్రంప్ 50 శాతం టారిఫ్ ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత దిగుమతి తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఇండియన్ ఆయిన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి సంస్థలు రషన్య్ చమురును స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేయగా రిలయన్స్, నయారా ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం తమకు ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల మేరకు యధావిధిగా కొనుగోలు జరుపుతున్నట్లు నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది.

Next Story