- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఓట్ చోరీ’ అంశంలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన బ్రెజిల్ మోడల్ లారిస్సా
ఎన్నికల సంఘంపై లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సంఘంపై లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో 2024లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆయన ఫైర్ అయ్యారు. అదేవిధంగా హర్యానాలో 5.21 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని.. అందులో 1.24 లక్షల మంది ఓటర్లు నకిలీ ఫొటోలను కలిగి ఉన్నారని ఆరోపించారు. అందుకు ఉదాహరణగా బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ సీమా, స్వీటీ, సరస్వతి పేర్లతో 10 వేర్వేరు బూత్‌ల నుంచి 22 సార్లు ఓట్లు వేశారని ధ్వజమెత్తారు.
అయితే, తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు బ్రెజిల్ మోడల్ పేరుతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో చివరకు విషయం కాస్త ఆ బ్రెజిల్ మోడల్ లారిస్సా బోనెసి వద్దకు చేరింది. ఇదే విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో లారిస్సా బోనెసి మాట్లాడుతూ.. “ఇది నేను నమ్మలేకపోతున్నాను.. ఆ ఫోటో 18 నుంచి 20 ఏళ్ల వయసులో ఉన్నప్పటిది” అని తెలిపారు. తనను భారతీయురాలిగా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని.. “ఏమి వెధవ లోకం ఇది..! ఏ ప్రపంచంలో బతుకుతున్నాం?” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఆ వీడియోను ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్, ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబైర్ తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్తా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజా పరిణామంతో హర్యానా ‘ఓటు చోరీ’ వివాదం మరింత రసవత్తరంగా మారింది.






