యువతిపై రాపిడో రైడర్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-16 14:02:34  IST  )

కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో రీసెంట్‌గా షాకింగ్ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే.

యువతిపై రాపిడో రైడర్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్!
X

దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో రీసెంట్‌గా షాకింగ్ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్న యువతి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా బైక్ రైడర్‌తో గొడవకు దిగింది. బైక్ దిగిన అనంతరం డబ్బులు చెల్లించేందుకు ఆమె నిరాకరించింది. దీంతో రాపిడో రైడర్ ఆగ్రహానికి గురై ఆ యువతి పై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవలో ఆమె ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగా, రాపిడో రైడర్ కన్నడ మాత్రమే మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు రాపిడో రైడర్ పై కేసు నమోదు చేసి.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాపిడో రైడర్ మాట్లాడుతూ.. "నేను రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు ఆమె నన్ను బైక్ ఆపమని అడుగుతూనే ఉంది. రోడ్డు మధ్యలో ఆగితే వెనుక నుంచి ఎవరైనా ఢీకొడతారని నేను చెప్పిన ఆమె వినలేదు" అని బైక్ టాక్సీ డ్రైవర్ సుహాస్ అన్నారు. ఈ క్రమంలో కోపంలో నేను ఆమెను నీ దేశానికి తిరిగి వెళ్లి పో అని అరిచానని అతను ఒప్పుకున్నాడు. కానీ, ఆ యువతి తనను దుర్భాషలాడిందని, తన కాలర్ పట్టుకుని గొడవకు దిగిందని అతను ఆరోపించాడు.

"ఆమె నన్ను చదువుకున్నవా లేదా అని అడిగింది. నాతో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉంది. నేను ఆమెను రాపిడో రైడ్ డబ్బులు చెల్లించామని మాత్రమే అడిగాను. దీంతో నన్ను రెండుసార్లు టిఫిన్ బాక్స్‌తో కొట్టింది. అప్పుడే నేను ఆమెను తిరిగి చెంపమీద కొట్టాను. నేను అప్పటికే అందరూ చూస్తున్నారు గొడవ ఆపు ఇక అని అడిగాను, తను మాత్రం గొంతును పెంచుతూనే ఉంది" అని చెప్పారు. ఈ క్రమంలో ఆ యువతి పై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ యువతి మీడియాతో మాట్లాడుతూ.. రాపిడ్ బైక్ రైడర్ ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదని తెలిపింది. అతను నాపై దాడి చేసి ఉండకూడదు. నేను డబ్బులు చెల్లించి హెల్మెట్ ఇచ్చాను. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో నేను అతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను. కానీ, అతను "మీ దేశానికి తిరిగి వెళ్ళు" అని అన్నాడు. అతను నన్ను కన్నడిగులు భాష తెలుసుకోవాలి. లేకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపో అని చెప్పిన నేను పట్టించుకోక పోయేదాన్ని.. కానీ "రాష్ట్రం" అనే పదాన్ని వాడకుండా, "దేశం" అనే పదాన్ని ఉపయోగించాడు" అతనిపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Next Story