- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌కి చావు దెబ్బ.. పొత్తుకు నో చెప్పిన అన్నాడీఎంకే!
అన్నాడీఎంకే, డీఎంకే కలుస్తాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ రెండు పార్టీల మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. డీఎంకే ఖాతాలో 59 సీట్లు ఉండగా అన్నాడీఎంకే ఖాతాలో 47సీట్లు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఎన్నికల ఫలితాల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకేకి 108 సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో సీఎం ప్రమాణస్వీకారానికి గవర్నర్ అడ్డు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీవీకేకు మరో 10 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కానీ వామపక్షాలు, తక్కువ సీట్లు వచ్చిన ఇతర పార్టీలు నో చెప్పడంతో విజయ్ ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో అన్నాడీఎంకే ఇప్పుడు కీలకంగా మారింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు విజయ్ పార్టీకి మద్దుతు తెలిపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కానీ అన్నాడీఎంకేతో పొత్తుకు మొదటి నుండి విజయ్ నో చెబుతూనే ఉన్నారు.
ఇప్పటికే ఓ సారి చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉండగానే అన్నాడీఎంకే, డీఎంకే కలుస్తాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ రెండు పార్టీల మధ్య తెరవెనుక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. డీఎంకే ఖాతాలో 59 సీట్లు ఉండగా అన్నాడీఎంకే ఖాతాలో 47సీట్లు ఉన్నాయి. రెండు మిత్రపక్షాలు కలిస్తే 120 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ దాటిపోతోంది. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ అవసరం లేకుండా ద్రవిడపార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే అన్నాడీఎంకే విజయ్‌కి తమ మద్దతు ఉండదంటూ ప్రకటించడం షాకింగ్ గా మారింది. ఆ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ మునుస్వామి.. పరిస్థితులు ఎలా ఉన్నా TVKతో పొత్తు పెట్టుకోవట్లేదు. విజయ్‌కు మా మద్దతు ఉండదు’ అని స్పష్టం చేశారు.






