- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. ఇజ్రాయెల్ PM నెతన్యాహు భారత పర్యటన రద్దు..!
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించాల్సిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించాల్సిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన పర్యటన అకస్మాత్తుగా రద్దు అయినట్లుగా తెలుస్తోంది. రాజధాని ఢిల్లీ (Delhi)లో జరిగిన ఘోర ఉగ్రదాడి కారణంగా భద్రతా ఆందోళనలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ మీడియా కథనం ప్రకారం, రెండు వారాల క్రితం ఢిల్లీలో జరిగిన పేలుడులో కనీసం 15 మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గత దశాబ్దంలో రాజధానిలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడిగా దానిని పరిగణిస్తున్నారు. నెతన్యాహు బృందం ప్రస్తుతం భద్రతా అంచనాలకు ప్రాధాన్యత ఇస్తూ పర్యటనను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ఇప్పటి వరకు మూడోసారి నెతన్యాహు భారత పర్యటన రద్దు కావడం గమనార్హం. కాగా, నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్‌ను సందర్శించగా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) 2017లో మొదటిసారిగా ఇజ్రాయెల్ వెళ్లిన భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కూడా కొనియాడుతున్న విషయం తెలిసిందే.






