ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చిన గిరిజనులు.. 15వేల కోట్లు చెల్లించాల్సిందే..

by Sujitha Rachapalli |

బ్రెజిల్‌లోని గిరిజన సముదాయం ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చింది. ఏకంగా 15వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. స్టార్ లింక్ ఇంటర్నెట్ వ్యవస్థ తమ కమ్యూనిటీలో తీవ్రమైన సమస్యలను కలిగించిందని ఆరోపించింది. హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా అడల్ట్ కంటెంట్ యాక్సెస్ పొందిన తమ యువకులు..

ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చిన గిరిజనులు.. 15వేల కోట్లు చెల్లించాల్సిందే..
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్రెజిల్‌లోని గిరిజన సముదాయం ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చింది. ఏకంగా 15వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. స్టార్ లింక్ ఇంటర్నెట్ వ్యవస్థ తమ కమ్యూనిటీలో తీవ్రమైన సమస్యలను కలిగించిందని ఆరోపించింది. హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా అడల్ట్ కంటెంట్ యాక్సెస్ పొందిన తమ యువకులు.. దాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నారని తెలిపింది. ఈ రకమైన ఆన్‌లైన్ ఎక్స్‌పోజర్‌కు తాము సిద్ధంగా లేమని.. తమ సంస్కృతి, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించిందని చెప్పారు ఆదివాసీలు. స్టార్‌లింక్ రిమోట్ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడంలో ప్రసిద్ధి చెందింది. కానీ ఈ కేసు డిజిటల్ యాక్సెస్‌ను సరైన విద్య, భద్రతా చర్యలు లేకుండా అందించినప్పుడు ఏర్పడే సమస్యలను చూపిస్తుండగా.. ఫుల్ డిటెయిల్స్ తెలుసుకుందాం.

అసలు ఏం జరిగింది?

మారుబో గిరిజన సముదాయం.. బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లోని ఇటుయి నది వెంబడి నివసించే 2,000 మంది సభ్యులతో కూడిన ఒక రిమోట్ తెగ. కాగా 2023 సెప్టెంబర్‌లో స్టార్‌లింక్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందింది. ఈ సర్వీస్ వారికి అత్యవసర సందర్భాలలో సహాయం కోసం కాల్ చేయడం, దూరంగా ఉన్న బంధువులతో వీడియో చాట్ చేయడం వంటి ప్రయోజనాలను అందించింది. అయితే ఇంటర్నెట్ రాకతో అక్కడి యువకులు సోషల్ మీడియా, వీడియో గేమ్స్, అడల్ట్ కంటెంట్‌కు బానిసలుగా మారిపోయారని గిరిజన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

మాపైనే కథనాలా???

కొంతమంది యువకులు వాట్సాప్ గ్రూప్‌లలో అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసుకున్నారని.. ఇది సంప్రదాయ గిరిజన సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వార్తలు అనేక మీడియా సంస్థల ద్వారా విస్తృతంగా వ్యాపించాయి. దీని ఫలితంగా గిరిజన సముదాయం అవమానానికి గురైందని, వారి గుర్తింపు, ఖ్యాతికి హాని జరిగిందని మస్క్‌పై వేసిన దావాలో పేర్కొన్నారు. కాగా మారుబో గిరిజనులు.. లాస్ ఏంజిల్స్ కోర్టులో స్టార్ లింక్‌తోపాటు న్యూయార్క్ టైమ్స్, TMZ, Yahooలపై 180 మిలియన్ డాలర్ల(రూ. 15వేల కోట్లకుపైనే) నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.

Next Story