అప‌రిశుభ్రంగా సీటు.. ప్రయాణికురాలికి రూ.1.75ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఇండిగోకు ఆదేశం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-10 14:03:52  IST  )

ఇండిగో ఎయిర్ లైన్స్‌కు ఢిల్లీ కన్జ్యూమర్ కమిషన్ షాక్ ఇచ్చింది. బాకు నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో కస్టమర్‌కు

అప‌రిశుభ్రంగా సీటు.. ప్రయాణికురాలికి రూ.1.75ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఇండిగోకు ఆదేశం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండిగో ఎయిర్ లైన్స్‌కు ఢిల్లీ కన్జ్యూమర్ కమిషన్ షాక్ ఇచ్చింది. బాకు నుండి ఢిల్లీ వెళ్లే విమానంలో కస్టమర్‌కు అపరిశుభ్రమైన భోజనం పెట్టారనే ఫిర్యాదుతో ఈ పెనాల్టీ విధించింది. ఢిల్లీలోని చాణక్యపురికి చెందిన పింకి అనే ప్రయాణికురాలు బాకు నుండి ఢిల్లీ వచ్చే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె విమానం ఎక్కేటప్పుడు కేటాయించిన సీట్లు మురికిగా, అపరిశుభ్రంగా ఉండటం గమణించింది. ఎయిర్ హోస్టెస్‌కు చెప్పగా ఆమెకు ఒంటరిగా కూర్చునేలా మరో సీటును కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికురాలు ఎయిర్ లైన్స్‌కు లీగల్ నోటీసులు పంపింది. కానీ సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం రాక‌పోవ‌డంతో ఆమె ప‌రిహారం కోరుతూ వినియోగ‌దారుల క‌మిష‌న్‌ను ఆశ్రయించింది.

ఈ ఘటనతో తాను విమానంలో మానసిక క్షోభకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇండిగో ప్రయాణికురాలికి వేరే సీటు కేటాయించి సమస్యను పరిష్కరించామని కమిషన్‌కు తెలిపింది. అయినప్పటికీ కమిషన్ ఇండిగో సమాధానానికి సంతృప్తి చెంద‌లేదు. సీట్ల ప‌రిస్థితి ఆమోద‌యోగ్యం కాద‌ని, ఇది సేవ‌ల‌లో లోపంగా ప‌రిగ‌ణించ‌బడింద‌ని పేర్కొంది. పౌర విమాన‌యాన అవ‌స‌రాల ప్ర‌కారం దేశంలో తీసుకువ‌చ్చిన వినియోగ‌దారుల ర‌క్ష‌ణ చ‌ట్టం 2029కి అనుగుణంగా ప్ర‌త్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఏర్పాటు చేయాల‌ని క‌మిష‌న్ ఆదేశించింది. అంతే కాకుండా ప్రయాణికురాలు పింకి మాన‌సిక వేద‌న‌, శారిర‌క వేద‌న‌కు కార‌ణ‌మైనందుకు రూ.1.75 ల‌క్ష‌ల రూపాయాల‌ను ఆమెకు చెల్లించాల‌ని తీర్పునిచ్చింది.

Next Story