- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన ఎన్నికల సంఘం
బిహార్ (Bihar)లో కొనసాగుతోన్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ (Special Intensive Revision)పై విమర్శలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ (Bihar)లో కొనసాగుతోన్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ (Special Intensive Revision)పై విమర్శలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా (Vijay Kumar Sinha)కు ఎన్నికల సంఘం (Elections Commission) తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇటీవలే డిప్యూటీ సీఎంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటరు కార్డులున్నాయని వెల్లడించారు. లఖిసరాయ్ నియోజకవర్గంతో పాటు బంకిపూర్ ఓటర్ జాబితాలో కూడా ఆయన పేరు ఉందని ఆరోపించారు. ఈ రెండు చోట్ల వేర్వేరు ఓటర్ కార్డు నెంబర్లతో పాటు ఆయన వయసు కూడా వేర్వేరుగా ఉందని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. ఎస్ఐఆర్ (SIR) తర్వాతే ఈ తతంగం అంతా జరిగిందని, ఈ తప్పునకు బాధ్యులెవరని తేజస్వీ యాదవ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆరోపణపై స్పందించిన ఈసీ, డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు నోటీసులు జారీ చేసింది. రెండు ఓటరు కార్డులు ఉన్నాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.






