అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్.. షోకాజు నోటీసులు ఇచ్చిన NAAC

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-13 08:39:37  IST  )

రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అల్-ఫలాహ్ యూనివర్సిటీకి బిగ్ షాక్.. షోకాజు నోటీసులు ఇచ్చిన NAAC
X

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఉగ్రదాడిలో అరెస్టయిన వారిలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన ముగ్గురు డాక్టర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలు అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కాలేజీలు NAAC (National Assessment and Accreditation Council) ఆమోదం పొందకపోయినా.. పొందాయంటూ యజమాన్యం వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్లుగా తేలింది. దీంతో నాకే, అల్-ఫలాహ్ యూనివర్సిటీపై చర్యలకు ఉపక్రమించి చేసిన తప్పుకు తాజాగా షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇచ్చిన నోటీసులపై 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని.. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని NAAC ప్రతినిధులు అల్-ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.

Next Story